
మా పొలంగట్టుపైనున్న చెట్టుకు వేలాడుతున్న పిచ్చుకగూడు ఇంటికి తెచ్చా!దానిలో పిచ్చుకలు లేవులెండి.గ్రుడ్లు పొదిగి పిల్లలు ఎగిరిపోయాయి.అదే చెత్తోనే తుమ్మచెట్లకు వ్రేలాడుతున్న ఎండిన తీగలను తెచ్చా! తీగలున్నాయి,తీగలపైన గూడున్నాది మరి పిచ్చుకలేవీ? భాగ్యనగరానికి వెళ్ళినప్పుడు పట్టుకొచ్చా రెండు పిట్టలను.వస్తూనే గూడెక్కి కూర్చున్నాయి.ఎలా ఉన్నాయి?